Nara Bhuvaneswari: నారా భువనేశ్వరిపై విమర్శలు గుప్పించిన అంబటి రాంబాబు

  • ఆమె ప్రేమ రైతులపైనా లేక భూములపైనా అంటూ విమర్శలు
  • ఇప్పుడెందుకు ప్రేమ కలిగిందని అడిగిన అంబటి
  • భువనేశ్వరిని చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని వ్యాఖ్యలు

రాజధాని అమరావతి రైతుల కోసం తన చేతి గాజులను విరాళంగా ఇచ్చిన నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. భువనేశ్వరికి రైతుల మీద ప్రేమా? లేక, అమరావతి భూములపై ప్రేమా? అంటూ ప్రశ్నించారు. ఎప్పుడూ లేనిది అమరావతి రైతుల మీద ఎందుకు ప్రేమ కలిగిందని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులు చనిపోతే భువనేశ్వరికి జాలి కలగలేదని ఆరోపించారు. పుష్కరాల్లో 30 మంది చనిపోయినా ఆమెకు జాలి కలగలేదని, రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా ఆమెకు బాధ లేదని విమర్శించారు.  ఇప్పుడు భువనేశ్వరి తన చేతి గాజులు ఇస్తుంటే తమకు జాలి కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా రాజధాని భూములపై వైసీపీ కార్యాలయంలో వీడియో ప్రదర్శించారు.

Nara Bhuvaneswari
Telugudesam
Andhra Pradesh
Amaravathi
Farmers
YSRCP
Ambati Rambabu
  • Loading...

More Telugu News