Andhra Pradesh: స్పీకర్ తమ్మినేని, మంత్రి బొత్సపై బుద్ధా వెంకన్న ధ్వజం

  • తాను స్పీకర్ అన్న విషయాన్ని మరచి తమ్మినేని మాట్లాడుతున్నారు
  • రాజధానిపై ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరం
  • జగన్ మెప్పు కోసమే బొత్స వ్యాఖ్యలు

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి బొత్స సత్యనారాయణ లపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. తమ్మినేని తాను స్పీకర్ అన్న విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఓ సీనియర్ ఎమ్మెల్యేగా తమ్మినేని తన ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని, రాజధానిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. జగన్ మెప్పు కోసమే బొత్స తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు జగన్ పై తాను ఎన్ని విమర్శలు చేశారో బొత్స గుర్తుతెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు.  

Andhra Pradesh
speaker
Tammineni
Botsa Satyanarayana
Minister
Telugudesam
Budda venkanna
MLC
  • Loading...

More Telugu News