Janasena: సినిమాల్లో పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’లా ఉండొచ్చు, ఇక్కడ మాత్రం ‘రబ్బర్ సింగ్’: మంత్రి వెల్లంపల్లి

  • మమ్మల్ని విమర్శించే నైతికహక్కు పవన్ కు లేదు
  • రాజధానిలో సినిమా స్టంట్లు చేయాలని చూస్తున్నారు
  • ఉద్దేశపూర్వకంగానే రైతులను రెచ్చగొడుతున్నారు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ లో పర్యటించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కు తమను విమర్శించే నైతికహక్కు లేదని అన్నారు.

పక్క రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు దీక్షలు చేస్తే మద్దతు తెలిపే పవన్, ఏపీఎస్సార్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం జగన్ ని అభినందించలేకపోయారని విమర్శించారు. రాజధానిలో సినిమా స్టంట్లు చేయాలని పవన్ చూస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సినిమాల్లో పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లా ఉండొచ్చు కానీ, ఇక్కడ మాత్రం ‘రబ్బర్ సింగ్’ అని ఎద్దేవా చేశారు.

Janasena
Pawan Kalyan
Minister
Vellampalli
  • Loading...

More Telugu News