Jeevitha: ఆయన చిన్నపిల్లవాడు లాంటోడు... నేను క్షమాపణ చెబుతున్నా: జీవిత

  • మా డైరీ ఆవిష్కరణ
  • తన వ్యాఖ్యలతో అగ్గి రాజేసిన రాజశేఖర్
  • చిరంజీవి తీవ్ర అభ్యంతరం
  • స్పందించిన జీవిత

'మా' డైరీ ఆవిష్కరణ సభలో రభస జరిగిన నేపథ్యంలో నటి జీవిత స్పందించారు. తన భర్త రాజశేఖర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు తెలిపారు. చిరంజీవి, మోహన్ బాబు వంటి దిగ్గజాలు సైతం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యేలా ప్రసంగించిన రాజశేఖర్ 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సెగలు పుట్టించారు. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనంటూ చిరంజీవి డిమాండ్ చేశారు.

 దాంతో జీవిత వేదికపైకి వచ్చి మాట్లాడారు. రాజశేఖర్ చిన్నపిల్లవాడు లాంటోడని అన్నారు. ఆయన తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని రాజశేఖర్, తాను ఎంతో తపన పడ్డామని అన్నారు. విభేదాలు ఎక్కడైనా ఉంటాయని, గొడవలు రావడం సహజమేనని పేర్కొన్నారు. అందరం మానవమాత్రులమేనని, దేవుళ్లం కాదని అభిప్రాయపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News