RRR: '2020 కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో..' అంటున్న 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్ ఒలీవియో

  • జనవరి 1 సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన యూనిట్
  • తాజాగా సినిమాపై ట్వీట్ చేసిన ఒలీవియా  
  • వైరల్ అవుతున్న ట్వీట్

రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం గురించి ఏ అప్ డేట్ వచ్చినా, ఫ్యాన్స్ దాన్ని ఆత్రుతగా చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. నిన్న జనవరి ఫస్ట్ సందర్భంగా కేవలం శుభాకాంక్షలు మాత్రమే చెప్పగా, అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. తాజాగా, సినిమా హీరోయిన్, ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న ఒలీవియా మోరిస్, ట్వీట్ చేస్తూ, హ్యాపీ న్యూ ఇయర్.. 2020 లో వచ్చే ఆర్ఆర్ఆర్ కోసం నేను నమ్మశక్యం కానంత ఆత్రుతగా వున్నాను' అంటూ  పేర్కొంది. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఒలీవియో పేరును ప్రకటించక ముందు ఆమె ట్విట్టర్ ఖాతాలో 300 మంది ఫాలోవర్లు ఉండగా, సినిమాలో చాన్స్ వచ్చిన తరువాత ఆమె ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 22 వేలకు పైగా పెరగడం గమనార్హం.

RRR
Olivia Moris
NTR
Rajamouli
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News