akhilesh: తనకు ఏం కావాలో అఖిలేశ్ కు తెలియదు !: బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్

  • అఖిలేశ్ పాక్ కు వెళ్లాలి
  • నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు చేయాలి
  • అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు అప్పుడు అర్థమవుతుంది

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌పై బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ చట్టం పట్ల అఖిలేశ్ తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'అఖిలేశ్ జీ పాక్ వెళ్లాలి.. నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు చేయాలి. అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు అప్పుడు అర్థమవుతుంది' అని వ్యాఖ్యానించారు.

'తనకు ఏం కావాలో అఖిలేశ్ కు తెలియదు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టరుల్లో ఏముందో ఆయన చదువుకోవాలి' అని  స్వతంత్ర దేవ్‌ సింగ్‌ సూచించారు. కాగా, సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా అఖిలేశ్ ఇటీవల సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

akhilesh
Uttar Pradesh
BJP
  • Loading...

More Telugu News