CDS: ఇది సాహసోపేతమైన నిర్ణయం: సీడీఎస్ నియామకంపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ కితాబు

  • సీడీఎస్ ను నియమించడాన్ని స్వాగతిస్తున్నాం
  • బిపిన్ రావత్ కు పూర్తి సహకారాన్ని అందిస్తాం
  • సీడీఎస్ కు సహకరించడం త్రివిధ దళాల బాధ్యత

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ను నియమించడాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ భదౌరియా స్వాగతించారు. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయమని ఆయన కితాబిచ్చారు. సీడీఎస్ గా నియమితులైన బిపిన్ రావత్ కు ఎయిర్ ఫోర్స్ పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. సీడీఎస్ కు సహకరించడం త్రివిధ దళాల బాధ్యత అని అన్నారు.

ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు విభాగాలు సంయుక్తంగా ముందుకు సాగేందుకు సీడీఎస్ ఉపయోగపడుతుందని చెప్పారు. భారత తొలి సీడీఎస్ గా రావత్ నిన్న బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్రివిధ దళాల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకు ముందు సీడీఎస్ గా నియమితులైన రావత్ కు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.



  • Loading...

More Telugu News