Rayapati: భవిష్యత్తులో పార్టీ మారే అవకాశాలు: తిరుమలలో రాయపాటి సంచలన వ్యాఖ్యలు

  • ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదు
  • కార్యకర్తల అభీష్టం మేరకు ఆలోచిస్తా
  • నా ఇంట్లో సీబీఐకి ఏమీ దొరకలేదు

ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచనేదీ లేదని, అయితే భవిష్యత్తులో కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారే అవకాశాలను తోసిపుచ్చలేనని మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి, స్వామిని దర్శించుకున్న ఆయన, మీడియాతో మాట్లాడారు.

రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు తన ఇంటికి సోదాల కోసం వచ్చినప్పుడు తాను ఇంట్లో లేనని స్పష్టం చేసిన ఆయన, తనిఖీల తరువాత వారికి ఏమీ లభించలేదని అన్నారు. అదే విషయాన్ని చెబుతూ, వారు తన ఇంటి నుంచి వెళ్లిపోయారని అన్నారు. అసలు సీబీఐ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని రాయపాటి అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వ్యవహారాలన్నీ సంస్థ సీఈవోనే చూసుకుంటున్నారని, తనకుగానీ, తన కుటుంబీకులకు గానీ ప్రమేయం లేదని అన్నారు.

Rayapati
CBI
Tirumala
Telugudesam
  • Loading...

More Telugu News