Nirbhaya: నిర్భయ దోషులకు నలుగురికీ ఒకేసారి ఉరి.. ఏర్పాట్లు షురూ!

  • దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసు
  • ప్రస్తుతం తీహార్ జైల్లో ఒకే ఉరికంబం
  • మరో మూడు కంబాలను, సొరంగాలను నిర్మిస్తున్న అధికారులు

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో దోషులు నలుగురికీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్షను నిరాకరించిన పక్షంలో ఆ వెంటనే వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ నెల 7న వీరిపై డెత్ వారెంట్ తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తుండగా, నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఒకే ఉరికంబం ఉండడంతో, మరో మూడింటిని నిర్మిస్తున్నారు. పీడబ్ల్యూడీ విభాగం సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమైంది. నూతనంగా మూడు ఉరికంబాలను, మూడు సొరంగాల నిర్మాణాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. కాగా, తీహార్ జైల్లో ఉరి తీసే ప్రదేశంలో మొత్తం 16 డెత్ సెల్స్ ఉండగా, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించగానే, నలుగురినీ నాలుగు వేర్వేరు గదులకు జైలు అధికారులు తరలించనున్నారు.

Nirbhaya
Convicts
Death Sentence
President Of India
Ramnath Kovind
  • Loading...

More Telugu News