Sangareddy: సంగారెడ్డి జిల్లాలో.. సంపూర్ణ మద్య నిషేధంపై గ్రామస్థుల తీర్మానం
- సమావేశంలో పాల్గొన్న మండల పీఎస్ ఎస్ఐ
- బెల్టు షాపులు తొలగించాలంటూ ఎస్ఐ కాళ్లపై బడ్డ వృద్ధురాలు
- మద్యంతో కుటుంబాలు చితికిపోతున్నాయన్న గ్రామస్థులు
మద్యం బెల్టు షాపులతో తమ కుటుంబాలు చితికిపోతున్నాయని సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలోని పైడిగుమ్మల్ గ్రామంలో మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్ఐ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన కుర్రి నర్సమ్మ అనే వృద్ధురాలు తమ గ్రామంలో బెల్టు షాపులను తొలగించాలని ఎస్ఐ కాళ్లు పట్టుకుని కోరడం అందరినీ కదిలించింది. తన కుమారుడు నిత్యం తాగొచ్చి కొడుతున్నాడని ఆ వృద్ధురాలు వాపోయింది. గ్రామస్థులనుద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ..మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలను వివరించారు.