New Delhi: గర్ల్ ఫ్రెండ్ కు గన్ ను చూపిస్తూ, తనకు తాను పేల్చేసుకున్న ఢిల్లీ యువకుడు!

  • న్యూఢిల్లీలోని తిలక్ నగర్ లో ఘటన
  • తొలుత గుర్తు తెలియని వ్యక్తి కాల్చాడని వెల్లడి
  • పోలీసుల విచారణలో వెల్లడైన నిజం

తన వద్ద ఉన్న గన్ ను స్నేహితురాలికి చూపిస్తున్న క్రమంలో పొరపాటున తనను తాను పేల్చేసుకున్న 25 ఏళ్ల యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన న్యూఢిల్లీ పరిధిలోని తిలక్ నగర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కాక్రోలా నివాసి అయిన సోనూ శర్మ, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తుపాకి గాయంతో తన స్నేహితురాలు మేఘతో కలిసి వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తి తనను కాల్చాడని వైద్యులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై పోలీసుల విచారణలో మద్యం మత్తులో ఉన్న సోనూ శర్మ తనకు గన్ ను చూపిస్తూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కాడని మేఘ పోలీసులకు వెల్లడించింది. ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందని, అది దేశవాళీ తుపాకి అని, మేఘా స్టేట్ మెంట్ ను రికార్డు చేసి, కేసును విచారిస్తున్నామని తెలిపారు.

New Delhi
Gun
Man
Shiooting
  • Loading...

More Telugu News