Pawan Kalyan: ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కల్యాణ్ ఫొటోను షేర్ చేసిన రేణూ దేశాయ్.. ఆసక్తికర వ్యాఖ్యలు

  • పిల్లలకు అద్భుతంగా, అందంగా తమ తల్లిదండ్రుల పోలికలు వస్తాయి
  • ఒక్కోసారి ఆద్య నాలా కనపడుతుంది
  • చాలా సార్లు ఆమె తన నానమ్మ, నాన్నలా కనపడుతుంది

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరు పిల్లలతో కలిసి రేణూ దేశాయ్ వేరుగా నివసిస్తోన్న విషయం తెలిసిందే. తన కూతురితో కలిసి పవన్ కల్యాణ్ దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'పిల్లలకు అద్భుతంగా, అందంగా తమ తల్లిదండ్రుల పోలికలు వస్తాయి. ఒక్కోసారి ఆద్య నాలా కనపడుతుంది. చాలా సార్లు ఆమె తన నానమ్మ, నాన్నలా కనపడుతుంది. ఆమె నా కెమెరాలో ఫేవరెట్ పర్సన్' అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.

కాగా, ఆమె ఇటీవల కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశారు. 1, 2, 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా నంటూ ఆద్య, అకీరాను ఉద్దేశించి పోస్ట్ చేశారు. వారిద్దరూ తన సొంతం అని అన్నారు.

దీనిపై పవన్ అభిమానులు విమర్శలు చేశారు. 'ఆ పిల్లలది ఎంతైనా పవన్ రక్తం కదా?' అని కామెంట్లు చేశారు. అయితే, వారికి రేణూ కౌంటర్ ఇస్తూ...  సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు' అని పేర్కొన్నారు. ఆశ్చర్యంగా ఈ రోజు ఆమె ఆద్య ఫొటో పోస్ట్ చేసి తన నాన్నలా ఉందని అనడం గమనార్హం.

Pawan Kalyan
reni dasai
Jana Sena
  • Loading...

More Telugu News