Gas: పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర!
- సబ్సిడీ రహిత గ్యాస్ ధర పెంపు
- రూ. 20 వరకూ పెంచిన చమురు కంపెనీలు
- ఐదు నెలల వ్యవధిలో రూ. 140 పెరిగిన ధర
సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. 14.2 కిలోల సిలిండర్ పై న్యూఢిల్లీలో రూ. 19, ముంబైలో రూ. 19.50, ఇతర ప్రాంతాల్లో రూ. 20 వరకూ పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో వరుసగా ఐదో నెలలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగినట్లయింది. ఈ ఐదు నెలల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరిగినట్లయింది.
ధరల పెంపు తరువాత ప్రస్తుతం న్యూఢిల్లీలో రూ. 684గా ఉన్న సిలిండర్ ధర రూ. 714కు చేరింది. ముంబైలో సిలిండర్ ధర రూ. 895కు పెరిగింది. ఇక కోల్ కతాలో రూ. 747, చెన్నైలో రూ. 734కు సిలిండర్ ధర చేరింది. పెంచిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని ఐఓసీఎల్ వెల్లడించింది. ఇదే సమయంలో 19 కిలోల బరువుండే కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,241, ముంబైలో రూ. 1,190గా ఉందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది.