Pawan Kalyan: పవన్ కల్యాణ్ నటనా నైపుణ్యాలను చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను: విజయసాయి రెడ్డి

  • అమరావతి రైతుల ముందు ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ప్రదర్శన అద్భుతం
  • టీడీపీ నాయకత్వం నుంచి ఆయన రెమ్యునరేషన్ పెంచుకోవాలి
  • రెమ్యునరేషన్ పెంచుకునేందుకు  ఆయన అర్హుడే 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రైతులను పరామర్శించడానికి రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని పేర్కొంటూ రెమ్యునరేషన్ పెంచుకోవాలని చురకలంటించారు.

'పనవ్ కల్యాణ్ నటనా నైపుణ్యాలను చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. అమరావతి రైతుల ముందు ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ప్రదర్శన తీరు చూశాక, టీడీపీ నాయకత్వం నుంచి ఆయన రెమ్యునరేషన్ ను మరింత పెంచుకునేందుకు అర్హుడని నేను భావించాను' అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

Pawan Kalyan
Telugudesam
Jana Sena
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News