Taiwan: ఒక్క చట్టంతో చైనాకు చెక్ పెట్టిన తైవాన్

  • తైవాన్ రాజకీయాల్లో పెరుగుతున్న చైనా జోక్యం
  • నేషనలిస్ట్ పార్టీ అభ్యర్థులకు గట్టి మద్దతు ఇస్తున్న డ్రాగన్ కంట్రీ
  • చొరబాటు నిరోధక చట్టానికి చట్ట సభ గ్రీన్ సిగ్నల్

తైవాన్ ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. తైవాన్ రాజకీయాల్లో చైనా ప్రమేయం పెరిగిపోతుండడాన్ని సహించలేకపోయిన తైవాన్ దీనికి అడ్డుకట్ట వేసింది. చైనా ప్రమేయాన్ని నిరోధించేలా తీసుకొచ్చిన చట్టానికి మంగళవారం ఆ దేశ చట్టసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తైవాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన నేషనలిస్ట్ పార్టీ అభ్యర్థులకు చైనా మద్దతు ఇస్తోంది. వారి ప్రచారానికి నిధులు సమకూర్చడంతోపాటు సోషల్ మీడియాలో వారికి అనుకూలంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు తైవాన్ ‘చొరబాటు నిరోధక చట్టాన్ని’ తీసుకొచ్చింది. చట్ట సభ నిన్న దీనికి ఆమోద ముద్ర వేయడంతో నేషనలిస్ట్ పార్టీ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.

  • Loading...

More Telugu News