pak senetor: పోర్న్ స్టార్ కు విషెస్ చెప్పిన పాక్ సెనెటర్ రెహ్మాన్ వ్యాఖ్య!

  • సీఏఏను వ్యతిరేకిస్తున్న భారతీయ ముస్లింల పట్ల స్పందన
  • వారందరినీ అభినందిస్తూ ట్వీట్
  • మాజీ ఫోర్న్ స్టార్ మియా ఖలీఫాకు కూడా విషెస్

సీఏఏపై భారత్ లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో పాక్ సెనెటర్ రెహ్మాన్ మాలిక్ ఓ పోర్న్ స్టార్ ను భారతీయురాలిగా భావించి పప్పులో కాలేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ భారత్ లో ముస్లింలు నిరసనలు తెలుపుతున్న సందర్భంగా మాలిక్ భారత్ లోని ముస్లింలకు సంఘీభావం తెలపాలనుకున్నారు. ట్విట్టర్ వేదికగా నిరసనలు తెలుపుతున్న ముస్లింలకు అభినందనలు తెలిపారు. భారతీయ ప్రాంతీయ భాషా నటిగా భావిస్తూ.. మాజీ ఫోర్న్ స్టార్ మియా ఖలీఫాను కూడా అభినందిస్తూ.. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలంటూ ట్వీట్ చేశారు.

ట్వీట్లో మియా ఫొటోతోపాటు, మాలిక్ ఫొటో కూడా ఉండటంతో నెటిజన్లు మాలిక్ పై వ్యంగ్య కామెంట్లను పెడుతూ ట్రోలింగ్ చేయసాగారు. మియా ఖలీఫా లెబనాన్ లోని బీరుట్ లో జన్మించినప్పటికీ.. అమెరికా పౌరసత్వాన్ని కలిగివుంది. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, జపాన్, జర్మనీ దేశాలను పొరుగు దేశాలంటూ పేర్కొనడంతో నెటిజన్లు ఇదేరీతిలో ట్రోలింగ్ చేశారు. తాజాగా మాలిక్ వ్యవహారం చోటుచేసుకోవడంతో నెటిజన్లకు పండగగా మారింది. అనంతరం విషయం తెలియడంతో మాలిక్ తన పోస్ట్ ను ట్విట్టర్ నుంచి తొలగించారు.

pak senetor
Rehman Malik
Twitter comments
CAA protesters
list in Twitter
  • Loading...

More Telugu News