Chilukuru: ఆలయ పరిసరాల్లో 'హ్యాపీ న్యూ ఇయర్' అంటే శిక్ష తప్పదు: చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు హెచ్చరిక

  • మరి కొన్నిగంటల్లో కొత్త సంవత్సరం
  • ఆలయంలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దంటున్న పూజారి
  • చెబితే గుంజీలు తీయిస్తానని వార్నింగ్

మరికొన్ని గంటల్లో భారత్ లో కొత్త సంవత్సరం వస్తోంది. జనవరి 1న ఒకరికొకరు విషెస్ చెప్పుకోవడం సాధారణమైన విషయం. అయితే, హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి సౌందరరాజన్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తమ ఆలయ పరిసరాల్లో ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితే వారితో గుంజీలు తీయిస్తామని హెచ్చరించారు. జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకోవడం మన సంస్కృతి కాదని, పాశ్చాత్యుల సంస్కృతిని మనం పాటించడం ఏంటి? అని ప్రశ్నించారు. తెలుగు ప్రజలకు ఉగాది నాడే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని, ఆ రోజునే వేడుకలు జరుపుకోవాలని అన్నారు.

Chilukuru
Balaji
Temple
Hyderabad
Happy New Year
  • Loading...

More Telugu News