Kanna Lakshminarayana: పౌరసత్వ సవరణ చట్టానికి సీఎం జగన్ మద్దతిచ్చారు.. అన్ని పార్టీలు సహకరించాలి: కన్నా

  • కడపలో కన్నా వ్యాఖ్యలు
  • సీఏఏ, ఎన్నార్సీలకు పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని వెల్లడి
  • జనవరి 4న నడ్డా కడప రాక

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కడపలో పర్యటించిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి సీఎం జగన్ మద్దతిచ్చారని గుర్తుచేశారు. సీఏఏ, ఎన్నార్సీలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు ఉందని వివరించారు. దేశహితం కోసం తీసుకున్న నిర్ణయాలను పార్టీలన్నీ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 4న కడపలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు.

Kanna Lakshminarayana
BJP
Andhra Pradesh
YSRCP
Jagan
CAA
NRC
  • Loading...

More Telugu News