Nara Lokesh: ఇది మరో దొంగ వార్త... వండి వార్చారు చూడండి: నారా లోకేశ్

  • కృష్ణపట్నం పోర్టు విశేష అధికారాలపై లోకేశ్ ట్వీట్
  • అది మహామేత వైఎస్సార్ ఘనతేనంటూ వ్యాఖ్యలు
  • జగన్ గారు ఎవరి చెవిలోనైనా పువ్వులు పెట్టేస్తారంటూ వ్యంగ్యం

చంద్రబాబు హయాంలో కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారని, ఇప్పుడు సీఎం జగన్ వచ్చిన తర్వాత కృష్ణపట్నం ముఖపరిధిని తగ్గించి రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తున్నాడని మరో దొంగ వార్తను వండి వార్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. దొంగసొమ్ముతో ఏర్పాటైన సాక్షి చానల్, పేపర్ లో రాసేవన్నీ తప్పులేనని జగన్ గారే అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు.

వాస్తవానికి కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టింది మహామేత వైఎస్సార్ అని తెలిపారు. 2008లో వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 40నే దీనికి సాక్ష్యం అని వెల్లడించారు. వినేవాళ్లు ఉంటే జగన్ ఎవరి చెవిలోనైనా పువ్వు పెట్టేస్తారని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అడ్డగోలుగా దోపిడీ చేసి ఆ పాపాలు వేరేవారి ఖాతాలో ఎలా వేస్తారండీ జగన్ గారూ? అంటూ లోకేశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Nara Lokesh
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Krishnapatnam Port
Ramayapatnam
YSRCP
Jagan
YSR
  • Loading...

More Telugu News