Pawan Kalyan: చంద్రబాబు పాలనలో నాలుగేళ్ల పాటు ఏం చేశావు?: పవన్ కల్యాణ్ పై జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు

  • రాజధానిలో పవన్ పర్యటన
  • రైతులకు పరామర్శ
  • వైసీపీ నేతలపై విమర్శలు
  • ఘాటుగా బదులిస్తున్న వైసీపీ నేతలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రంగులు మార్చుకోవడానికి, వేషాలు మార్చుకోవడానికి, చివరికి పెళ్లాలను మార్చుకోవడానికి తప్ప రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఘాటుగా విమర్శించారు. "రెండు చోట్ల పోటీచేసినా గెలవలేని ఈ పిచ్చితుగ్లక్ మాకు చెబుతున్నాడు! 151 కాదు, అవసరమైతే అంతకంటే ఎక్కువే గెలుస్తాం. చంద్రబాబు పాలనలో నాలుగేళ్ల పాటు ఏంచేశారు? ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు" అంటూ మండిపడ్డారు. ఓ ముల్లు గుచ్చుకుంటే పారిపోయే వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలో రైతులను కలుస్తూ పవన్ తమపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నట్టు అర్థమవుతోంది.

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
YSRCP
Jogi Ramesh
Amaravathi
  • Loading...

More Telugu News