Hyderabad: హైదరాబాదులో పెట్రోల్ బంక్ లో మంటలు

  • కారులో పెట్రోల్ నింపుతుండగా ప్రమాదం
  • కారుతో పాటు, బంక్ దగ్ధం
  • కారులోని వారు దిగిపోవడంతో తప్పిన ప్రాణాపాయం

హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంకు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. షేక్ పేటలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో సంభవించిన అగ్ని ప్రమాదంలో బంకుతో పాటు ఓ కారు మంటలకు ఆహుతి అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ కారులో పెట్రోల్ నింపుతుండగా.. హఠాత్తుగా కారులోంచి మంటలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లందరు దూరంగా పరుగెత్తారు. కారులో ఉన్నవారు కూడా వెంటనే బయటకు రావడంతో.. ప్రాణాపాయం తప్పింది.

అయితే మంటల్లో కారు, పెట్రోల్ బంకు పూర్తిగా కాలిపోయాయి. మంటల కారణంగా భారీ ఎత్తున పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Hyderabad
Shekpeta
petrol bunk
Fire Accident
Telangana
  • Loading...

More Telugu News