Rayapati Sambasivarao: రాయపాటి సాంబశివరావుపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు

  • నవంబరు 18న సీబీఐకి ఫిర్యాదు చేసిన యూనియన్ బ్యాంకు వర్గాలు
  • ఈ ఉదయం రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు
  • రాయపాటి సహా పలువురిని నిందితులుగా పేర్కొన్న సీబీఐ

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఉదయం సాంబశివరావు నివాసంలో సోదాలు నిర్వహించిన సీబీఐ అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై 120 (బి), రెడ్ విత్ 420, 406, 468, 477 (ఏ), పీసీఈ యాక్ట్ 13 (2), రెడ్ విత్ 13 (1) డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవంబరు 18న సీబీఐకి యూనియన్ బ్యాంకు ప్రాంతీయ హెడ్ ఎస్.కె.భార్గవ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ట్రాన్స్ ట్రాయ్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసబాబ్జీలను సీబీఐ నిందితులుగా చేర్చింది.

Rayapati Sambasivarao
Guntur
CBI
Union Bank
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News