Andhra Pradesh: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ సేవలు వాయిదా... ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

  • జనవరి 1న ప్రారంభం కావాల్సిన సేవలు
  • మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఆలస్యం
  • జనవరిలోనే మరో తేదీన ప్రారంభించాలని నిర్ణయం

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, జనవరి 1 నుంచి ప్రారంభం కావాల్సిన వార్డు, గ్రామ సచివాలయ సేవలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జనవరిలోనే మరో రోజున ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామకం కూడా పూర్తయింది. కానీ, వార్డు, గ్రామ సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాకపోవడంతో సేవలు ఆలస్యం అవుతున్నాయి.

Andhra Pradesh
YSRCP
Jagan
Village Secretariat
  • Loading...

More Telugu News