Andhra Pradesh: జగన్ సైలెంట్ గా కాజేస్తే, వైసీపీ మంత్రులు తాము కూడా తక్కువ తినలేదంటున్నారు: నారా లోకేశ్

  • ఏపీ మంత్రులపై లోకేశ్ ధ్వజం
  • పేదల భూములు లాక్కుంటున్నారంటూ ఆగ్రహం
  • మహిళల కష్టార్జితాన్ని కూడా వదలడం లేదంటూ మండిపాటు

ఏపీ మంత్రులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సైలెంట్ గా విశాఖ భూములు కాజేస్తే, తాము కూడా తక్కువ తినలేదంటూ వైసీపీ మంత్రులు ఓ అడుగు ముందుకేసి గుట్టుచప్పుడు కాకుండా పేదల భూములు లాగేసుకుంటున్నారని ఆరోపించారు. మొన్న బొత్స సత్యనారాయణ, నిన్న ఆదిమూలపు సురేశ్ కుటుంబసభ్యులు నేరుగా ప్రజలపై పడి భూకబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కనీసం మహిళలు అని కూడా చూడకుండా వారి కష్టార్జితాన్ని కబ్జా చేస్తూ రోడ్డు మీద నిలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు, ఇతర నేతల భూదాహానికి ప్రజలు హడలిపోతున్నారంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Nara Lokesh
Botsa Satyanarayana
Adimulapu
  • Loading...

More Telugu News