Jagan: అర్జున అవార్డు గ్రహీత వెన్నం సురేఖను సత్కరించిన సీఎం జగన్

  • అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్న తెలుగు ఆర్చర్
  • తాను సాధించిన విజయాలను సీఎంకు వివరించిన జ్యోతి సురేఖ
  • భవిష్యత్తులో మరింత రాణించాలంటూ జగన్ ఆశీస్సులు

ప్రముఖ విలువిద్య క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను ఏపీ సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. ఇటీవలే ముగిసిన 21వ ఆసియా ఆర్చరీ చాంపియన్ షిప్ లో జ్యోతి సురేఖ ప్రతిభాపాటవాలు ప్రదర్శించింది. అంతేకాదు, నెదర్లాండ్స్ లో జరిగిన 50వ వరల్డ్ చాంపియన్ షిప్ లోనూ ఈ తెలుగమ్మాయి సత్తా చాటింది. ఈ సందర్భంగా జ్యోతి సురేఖ సీఎం జగన్ ను తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసింది. సీఎంకు తాను సాధించిన విజయాలను వివరించిన జ్యోతి, పతకాలను చూపించింది. ఆమెకు శాలువా కప్పిన సీఎం జగన్, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని కూడా అక్కడే ఉన్నారు.

Jagan
Andhra Pradesh
YSRCP
Jyothi Surekha
Archer
  • Loading...

More Telugu News