JC Prabhakar Reddy: మేం టీడీపీలో ఉన్నామన్న కక్షతో మమ్మల్ని టార్గెట్ చేశారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే
  • తమ బస్సులు సీజ్ చేస్తున్నారని ఆగ్రహం
  • అప్పట్లోనే కార్లలో తిరిగిన చరిత్ర తమదని వ్యాఖ్యలు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. తాము టీడీపీలో ఉన్నామన్న కక్షతో తమను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇతర ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసిన రెండోరోజే రిలీజ్ చేస్తుంటే, దివాకర్ ట్రావెల్స్ బస్సులను మాత్రం రిలీజ్ చేయడంలేదని మండిపడ్డారు.

స్థానిక అధికారులు తమ బస్సులను సీజ్ చేసేందుకు నిరాకరిస్తున్నారని, దీంతో చిత్తూరు నుంచి అధికారులను రప్పించి మరీ బస్సులు సీజ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి బతుకులు ఏంటో తమకు తెలుసని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే తమ కుటుంబం కార్లలో తిరిగిందని, ఇలాంటి కేసులకు భయపడేదిలేదని అన్నారు. తానేమీ 16 నెలలు జైల్లో కూర్చుని రాలేదంటూ జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు.

JC Prabhakar Reddy
JC Diwakar Reddy
Telugudesam
YSRCP
Jagan
Diwakar Travels
  • Loading...

More Telugu News