Bipin Rawat: కొత్త ఆర్మీ చీఫ్ గా మనోజ్‌ ముకుంద్‌ నరవణే నియామకం!

  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
  • నేడు ఆర్మీ చీఫ్ గా పదవీ విరమణ చేయనున్న బిపిన్ రావత్
  • రేపు భారత తొలి సీడీఎస్ గా బాధ్యతల స్వీకరణ

భారత సైన్యాధ్యక్షుడిగా జనరల్ మనోజ్‌ ముకుంద్‌ నరవణేను నియమిస్తూ, కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతవరకూ ఈ పదవిలో ఉన్న మేజర్ జనరల్ బిపిన్ రావత్ నేడు పదవీ విరమణ చేసి, ఆపై మహా సైన్యాధిపతిగా (సీడీఎస్ - చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) పదవీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో తదుపరి ఆర్మీ చీఫ్ గా మనోజ్ ను నియమిస్తూ, నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి సైన్యాధ్యక్షుడు మనోజ్‌ ముకుంద్‌ నరవణేకు అభినందనలు తెలిపిన రావత్, భారత సైన్యాన్ని ముందుకు నడిపించడంలో ఆయన శక్తియుక్తులు సమర్థవంతంగా పని చేస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, బుధవారం నాడు బిపిన్ రావత్ భారత తొలి సీడీఎస్ గా పదవీ బాధ్యతలను చేపట్టనున్న సంగతి తెలిసిందే.

Bipin Rawat
Manoj Saravana
Army Chief
  • Loading...

More Telugu News