Road Accident: విజయవాడ వద్ద యాసిడ్ లారీని ఢీకొన్న కారు... గ్రూప్-1 అధికారిణి దుర్మరణం!

  • ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదం
  • ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న రాగ మంజీర
  • యాసిడ్ పడి తీవ్రగాయాలతో దుర్మరణం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గ్రూప్-1 అధికారిణి ఒకరు దుర్మరణం పాలయ్యారు. యాసిడ్ లోడ్ తో వెళుతున్న లారీ రహదారి పక్కన ఆగివుండగా, వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో గ్రూప్-1 అధికారిణి, ప్రస్తుతం ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న రాగ మంజీర మరణించారు. ఈ ప్రమాదంలో లారీ ట్యాంకర్ దెబ్బతినగా, యాసిడ్ మీదపడి ఆమె మరణించినట్టు సమాచారం. విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన రాగ మంజీర, ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిటర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదం విషయాన్ని గురించి తెలుసుకున్న పోలీసులు, ఘటనాస్థలికి వచ్చి, కేసును నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసును విచారిస్తున్నామని తెలిపారు.

Road Accident
Raga Manjeera
Group 1
IAS
  • Loading...

More Telugu News