malavat purna: తెలంగాణ అమ్మాయి మాలావత్ పూర్ణ మరో ఘనత!
- ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతాల్లో ఒకటైన విన్సన్ మసిఫ్‌పై కాలు
- ఆరు ఖండాల్లో ఆరు పర్వతాలను అధిరోహించిన మాలావత్
- వచ్చే ఏడాది ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతారోహణ
తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతాల్లో ఒకటైన విన్సన్ మసిఫ్‌ను అధిరోహించింది. అంటార్కిటికా ఖండంలోని 16050 అడుగుల ఎత్తైన ఈ పర్వత శిఖరంపై త్రివర్ణ పతకాన్ని చేబూని ఈ నెల 26న అడుగుపెట్టింది. ఫలితంగా ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలని పెట్టుకున్న ఆమె.. లక్ష్యానికి మరింత చేరువైంది.
2014లో తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డులకెక్కిన పూర్ణ.. ఆ తర్వాత ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్బ్రన్, దక్షిణ అమెరికాలోని అకోన్ కాగ్వా, ఒషినియా రీజియన్‌లోని కార్ట్స్ నెట్‌ను అధిరోహించింది. ఫలితంగా ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన పర్వతాలపై ఆమె కాలు మోపినట్టు అయింది. వచ్చే ఏడాది ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించనుంది. దీంతో ఆమె లక్ష్యం పూర్తి అవుతుంది.