Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాను చూస్తుంటే బాధగా ఉందంటూ కంటతడి పెట్టిన స్పీకర్ తమ్మినేని

  • శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన స్పీకర్
  • పొందూరులో తీవ్ర భావోద్వేగాలకు గురైన వైనం
  • శ్రీకాకుళం అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని రావాల్సిందేనని స్పష్టీకరణ

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సందర్భంగా తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఇతర జిల్లాలతో పోల్చితే శ్రీకాకుళం ఎంతో వెనుకబడిందని, ఇక్కడి ప్రజలు ఉపాధి లేక పొట్టకూటి కోసం వలస పోతుండడం చూస్తుంటే బాధగా ఉందంటూ కంటతడి పెట్టారు. శ్రీకాకుళం అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని రావాల్సిందేనని నిక్కచ్చిగా చెప్పారు. ఓ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, ఆ దమ్ము ఏపీ సీఎం జగన్ కు ఉందని కొనియాడారు. జిల్లాలోని పొందూరులో మాట్లాడుతూ తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
Assembly
Speaker
Tammineni Sitharam
Srikakulam District
  • Loading...

More Telugu News