cm: ఫిరాయింపుల విషయంలో జగన్ ఇచ్చిన మాట తప్పారు: టీడీపీ నేత రామానాయుడు

  • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు
  • మా ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై జగనే జవాబు చెప్పాలి
  • ‘మూడు రాజధానుల’ పేరిట ప్రాంతీయ విభేదాలు తగదు

మూడు రాజధానుల పేరిట ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ  ఎమ్మెల్యే రామానాయుడు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో  మాట్లాడుతూ, ఐదేళ్లుగా రాజధాని ఏర్పాటు చేసుకుని అమరావతి వేదికగా సజావుగా పరిపాలన సాగిందని అన్నారు. ఇప్పుడు, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని, అది సీఎం జగన్ పుణ్యమేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ‘మాట తప్పను మడమ తిప్పను’ అని చెప్పే జగన్ మాట తప్పారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంపై జగనే సమాధానం చెప్పాలని అన్నారు.
 

cm
Jagan
Telugudesam
mla
Ramanaidu
  • Loading...

More Telugu News