Mahesh Babu: కుటుంబంతో కలిసి షిరిడీ వెళ్లిన మహేశ్ బాబు... సాయినాథుని దర్శనం
![](https://imgd.ap7am.com/thumbnail/tn-acffd6426dc6.jpg)
- సంక్రాంతి సీజన్ లో వస్తున్న మహేశ్ బాబు కొత్త చిత్రం
- జనవరి 11న రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు
- సాయి ఆశీర్వాదం అందుకున్న మహేశ్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు విజయవంతం కావాలని కోరుకుంటూ కుటుంబంతో సహా షిరిడీ సాయినాథుని దర్శనం చేసుకున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో షిరిడీ సాయి ఆశీస్సుల కోసం మహేశ్ బాబు తన కుటుంబసభ్యులతో కలిసి షిరిడీ విచ్చేశారు. ఆయనకు షిరిడీ సంస్థాన్ సభ్యులు స్వాగతం పలికారు. సాధారణంగా మహేశ్ బాబు తన చిత్రం విడుదలకు ముందు తిరుమల వెళుతుంటారు. ఈసారి అందుకు భిన్నంగా షిరిడీ వెళ్లి సాయిబాబా ఆశీస్సులు అందుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు మహేశ్ బాబుకు జ్ఞాపికను బహూకరించాయి.
![](https://img.ap7am.com/froala-uploads/froala-95e03f203fb4475bce54e7cf0f9db98093699c68.jpeg)