Chandrababu: ఈసారి నూతన సంవత్సర వేడుకలకు టీడీపీ దూరంగా ఉంటుంది: చంద్రబాబు ప్రకటన

  • రైతుల ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం
  • వేడుకలకు ఖర్చు చేసే సొమ్మును విరాళంగా ఇవ్వాలని సూచన
  • జనవరి 1న రాజధాని గ్రామాల్లో పర్యటించాలని పిలుపు

ప్రపంచమంతా కొత్త సంవత్సరం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు టీడీపీ దూరంగా ఉంటుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది రైతులు రోడ్డెక్కి తమ భవిష్యత్తు కోసం ఆందోళనలు చేస్తున్న తరుణంలో తాము న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం సబబు కాదని చంద్రబాబు ట్వీట్ చేశారు. కొత్త సంవత్సర వేడుకల కోసం ఖర్చు చేసే సొమ్మును పార్టీ నేతలు, కార్యకర్తలు అమరావతి పరిరక్షణ సమితికి విరాళంగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి 1న రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులు, కూలీలకు అండగా ఉందామని పార్టీ శ్రేణులకు సూచించారు.

Chandrababu
Telugudesam
Andhra Pradesh
Amaravathi
New Year
  • Loading...

More Telugu News