Small fire accident at PM Modi residence: ప్రధాని మోదీ నివాసంలో స్వల్ప అగ్ని ప్రమాదం

  • ఎస్పీజీ రెసెప్షన్ లో చోటుచేసుకున్న ప్రమాదం
  • మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
  • షార్ట్ సర్క్యూట్ కారణమన్న పీఎంవో 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించక ముందే అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని ఆర్పివేశారు. ఢిల్లీలోని కల్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసంలో సాయంత్రం 7.25 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 9 అగ్ని మాపక శకటాలతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటన చేసింది. స్వల్ప అగ్ని ప్రమాదమేనని తెలిపింది. ఎస్పీజీ రిసెప్షన్ లో ఈ ప్రమాదం జరిగిందని ట్విట్టర్ మాద్యమంగా వెల్లడించింది.

Small fire accident at PM Modi residence
controlled by fire department
Delhi
  • Loading...

More Telugu News