Amaravathi: బెయిల్ పై విడుదలైన రాజధాని రైతులు.. స్వాగతం పలికిన టీడీపీ నేతలు

  • మీడియాపై దాడి కేసులో నిన్న రాజధాని రైతుల అరెస్టు
  • ఒక్కొక్కరికీ రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్  
  • మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు

మీడియాపై దాడి కేసులో ఆరుగురు రాజధాని రైతులను నిన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన రైతులు బెయిల్ పై ఇవాళ విడుదలయ్యారు. ఈరోజు ఉదయం రైతులు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక్కొక్కరికీ పది వేల రూపాయల పూచీకత్తుతో మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు.

దీంతో ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలైన రైతులకు టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్ కుమార్, రామకృష్ణ స్వాగతం పలికారు. కాగా, ఆరుగురు రైతులను నిన్న ఉదయం అరెస్టు చేసి తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోర్టులో వారిని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించగా, బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.

Amaravathi
Telugudesam
farmers
Bail
Release
  • Loading...

More Telugu News