Chandrababu: ఇతన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టు అంటారా?: వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు
![](https://imgd.ap7am.com/thumbnail/tn-733e732923ce.jpg)
- వీడియో పోస్టు చేసిన చంద్రబాబు
- ఆవేదన వెలిబుచ్చిన రైతు
- వైసీపీ నేతలపై చంద్రబాబు ధ్వజం
రాజధాని అమరావతి విషయంలో నెలకొన్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రాజధానిలో నిరసనలు, ధర్నాలు చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులంటూ వస్తున్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. స్వయంగా ఓ వైసీపీ నేత వెలిబుచ్చిన ఆవేదనను వీడియో రూపంలో ట్వీట్ చేశారు. అతని మాటలు వింటుంటే వైసీపీ నేత అని తెలుస్తోందని, రాజధానిలో తనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడని, మరి ఇతన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టు అంటారా? అంటూ వైసీపీ నేతలను నిలదీశారు. వైసీపీ నేతల నిర్వాకాలు, మంత్రుల వ్యాఖ్యలు రాజధాని రైతుల మనస్సులను ఎంత గాయపరుస్తున్నాయో అతని మాటల ద్వారా అర్థమవుతోందని తెలిపారు.