Guntur: జగన్ కార్యదక్షత ఉన్న నాయకుడు!: టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి

  • నియోజకవర్గ పరిస్థితిని వివరించాను
  • రూ.25 కోట్ల విడుదలకు సీఎం ఆదేశించారు
  • చంద్రబాబు హయాంలో గుంటూరు అధ్వానంగా తయారైంది

ఏపీ సీఎం జగన్ ను గుంటూరు టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇవాళ కలిసిన విషయం తెలిసిందే. జగన్ ని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీడీపీని వీడే ప్రసక్తే లేదని, తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే జగన్ ని కలిశానని చెప్పారు. నియోజకవర్గ పరిస్థితిని ఆయనకు వివరించానని, అభివృద్ధి నిమిత్తం వెంటనే రూ.25 కోట్లు విడుదల చేయాలని జగన్ ఆదేశించారని అన్నారు. సీఎం జగన్ కార్యదక్షత ఉన్న నాయకుడని, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు.

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాదిరిగానే మీరు కూడా అదే బాటలో నడుస్తారా? అన్న ప్రశ్నకు గిరి సమాధానమిస్తూ, ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు దాటిందని, రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కన్నా నియోజకవర్గంలో సమస్యలు, ఇబ్బందుల గురించి మాట్లాడుకోవడం మంచిదని, చేయాల్సిన అభివృద్ధి చేస్తే బాగుంటుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో గుంటూరు నగరం అధ్వానంగా మారిందని, అమరావతిలో అభివృద్ధి జరగలేదని చెప్పారు.

Guntur
West Mla
Maddali Giri
cm
Jagan
  • Loading...

More Telugu News