Puri: ముంబైలో యాక్షన్ కి దిగనున్న 'ఫైటర్'

  • పూరి దర్శకుడిగా రూపొందనున్న 'ఫైటర్'
  • ముంబై లొకేషన్స్ లో చిత్రీకరణ 
  • కథానాయికగా జాన్వీ కపూర్ పేరు

విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. పూరి - చార్మి కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి, కరణ్ జోహర్ కూడా నిర్మాణ భాగస్వామిగా వున్నాడు.

ఈ కారణంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ముంబైలోని 'జుహూ' .. 'తాజ్' హోటల్ ప్రదేశాల్లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. అక్కడి లొకేషన్స్ ను ఆల్రెడీ ఖాయం చేశారట. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీకపూర్ నటించనుందని అంటున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News