Andhra Pradesh: మీడియాపై దాడి కేసులో రాజధాని రైతులకు బెయిల్
- ఆరుగురు రైతులకు బెయిల్ మంజూరు
- బెయిల్ పత్రాలతో గుంటూరు జైలుకు బయల్దేరిన న్యాయవాదులు
- ఈ సాయంత్రం విడుదలయ్యే అవకాశం
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై రైతులు దాడి చేశారంటూ ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ అంశంలో రాజధాని రైతులపై కేసులు కూడా నమోదవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా, ఆరుగురు రైతులకు బెయిల్ మంజూరైంది. మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మి రైతులకు బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. బెయిల్ పత్రాలతో న్యాయవాదులు గుంటూరు కారాగారం వద్దకు బయల్దేరారు. మీడియాపై దాడి కేసులో జైలుపాలైన రాజధాని రైతులు ఈ సాయంత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.