Hyderabad: ఈ నెల 31న అర్ధరాత్రి వరకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సర్వీసులు.. మందుబాబులకు కూడా అనుమతి!

  • 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి వరకు ప్రత్యేక సర్వీసులు
  • మద్యం సేవించిన వారు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దు
  • ఓ ప్రకటనలో ‘మెట్రో’ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

కొత్త సంవత్సరం నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెట్రో ప్రత్యేక సర్వీసులు అన్ని స్టేషన్ల నుంచి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఆరోజు రాత్రి మద్యం సేవించిన వారికి మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. అయితే, మద్యం సేవించిన వారు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.

Hyderabad
Metro Rail
special services
New year
  • Loading...

More Telugu News