Sensex: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • 17 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 10 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • ఒకానొక సమయంలో 100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్లు నష్టపోయి 41,558కి పడిపోయంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 12,256 వద్ద స్థిరపడింది. ఈరోజు ఉదయం సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 100 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని స్వల్ప నష్టాలతో ముగిసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (1.50%), హీరో మోటోకార్ప్ (1.43%), నెస్లే ఇండియా (1.42%), టాటా స్టీల్ (1.05%), సన్ ఫార్మా (0.97%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-0.89%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.89%), టీసీఎస్ (-0.69%), ఏసియన్ పెయింట్స్ (-0.57%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.56%).

  • Loading...

More Telugu News