Maddali Giri: టీడీపీలో మరో వికెట్ డౌన్.. కాసేపట్లో జగన్ ను కలవనున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే

  • టీడీపీకి గుడ్ బై చెప్పనున్న మద్దాలి గిరి
  • కాసేపట్లో జగన్ తో భేటీ
  • మంత్రి వెల్లంపల్లితో కలసి వెళ్లిన గిరి

తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. వైసీపీలో చేరేందుకు మరో ఎమ్మెల్యే రెడీ అయ్యారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ ను ఆయన కలవనున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి కాసేపటి క్రితం ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లితో అదే సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరి గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఓవైపు రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. ఈయనతో పాటు మరికొందరు కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Maddali Giri
Telugudesam
YSRCP
Jagan
  • Loading...

More Telugu News