Ilayaraja: ఇళయరాజా వేగానికి అచ్చెరువొందిన కృష్ణవంశీ

  • రంగమార్తాండ చిత్రానికి ఇళయరాజా సంగీతం
  • 10 నిమిషాల్లో రెండు పాటలకు ట్యూన్లు ఇచ్చిన ఇళయరాజా
  • ఆ వేగం ఆయనకే చెల్లిందంటూ కృష్ణవంశీ ప్రశంసలు

భారత చలనచిత్ర రంగంలో ఇళయరాజా ఓ శిఖరం. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన నుంచి స్వరాలు జాలువారుతూనే ఉన్నాయి. మెలొడీకి కొత్త అర్థం చెప్పిన ఆయన ఇప్పటితరం సినిమాలకు కూడా నవ్యరీతిలో సంగీతం అందిస్తూ తన ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. తాజాగా తెలుగులో తెరకెక్కుతున్న రంగమార్తాండ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర దర్శకుడు కృష్ణవంశీ వెల్లడించారు.

ఇళయరాజా తమ రంగమార్తాండ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారని, పాటల కోసం తాను చెప్పిన సిచ్యుయేషన్స్ విని ఎంతో అభినందించారని తెలిపారు. అంతేకాదు, ఇళయరాజా కేవలం 10 నిమిషాల్లో రెండు పాటలకు ట్యూన్లు ఇవ్వడం పట్ల కృష్ణవంశీ విస్మయం చెందారు. కొద్దివ్యవధిలోనే అద్భుతమైన బాణీలు పుట్టించారని, ఎంతో వేగంగా, సరికొత్తగా ట్యూన్లు ఇవ్వడం ఇళయరాజాకే సాధ్యమని కొనియాడారు. చెన్నైలోని అడయార్ పార్క్ లో రంగమార్తాండ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలిపారు.

Ilayaraja
Krishnavamsi
Rangamarthanda
Tollywood
Music
Songs
  • Error fetching data: Network response was not ok

More Telugu News