Rajanna Sircilla District: మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించిన సీఎం కేసీఆర్

  • ‘మిడ్ మానేరు’కు జలహారతి
  • జీరో పాయింట్ నుంచి గేట్ల వరకు ప్రాజెక్టు పరిశీలన
  • కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, కొప్పుల తదితరులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. కాళేశ్వరం జలాలతో నిండిన మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించారు. జీరో పాయింట్ నుంచి గేట్ల వరకు ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నదికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిడ్ మానేరుకు జలహారతి ఇచ్చారు. అంతకుముందు, వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, పలువురు నేతలు, అధికారులు ఉన్నారు.

Rajanna Sircilla District
cm
kcr
Mid-maneru
  • Loading...

More Telugu News