Leo Varadkar: భారత్ లో తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించిన ఐర్లాండ్ ప్రధాని

  • 2017లో ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికైన లియో వరాద్కర్
  • భారత్ లో వరాద్కర్ మూలాలు
  • మహారాష్ట్రలోని వరాద్ గ్రామం వరాద్కర్ స్వస్థలం

ఇటీవల కాలంలో భారత సంతతి వ్యక్తులు అనేక దేశాల ప్రభుత్వాల్లో కీలకపదవులు చేపట్టడం సాధారణ విషయంగా మారింది. అలాంటివారిలో ఐర్లాండ్ ప్రధానమంతి లియో వరాద్కర్ ఒకరు. లియో వరాద్కర్ మూలాలు భారత్ లోనే ఉన్నాయి. ఆయన పూర్వీకుల స్వస్థలం మహారాష్ట్ర తీరప్రాంతంలోని సింధుదుర్గ్ జిల్లా. ఇక్కడి మల్వాన్ తెహ్సిల్ ప్రాంతంలోని వరాద్ లియో వరాద్కర్ పూర్వీకుల జన్మస్థానం. తాజాగా ఆయన వరాద్ గ్రామానికి విచ్చేశారు. అక్కడ ఉన్న తన బంధువులను కలుసుకుని మురిసిపోయారు. వారు కూడా తమ కుటుంబీకుడు ఓ దేశ ప్రధాని కావడంతో ఘనస్వాగతం పలికారు. లియో వరాద్కర్ తన పూర్వీకుల గ్రామానికి రావడం ఇదే మొదటిసారి కాదు. 2017లో ఐర్లాండ్ ప్రధాని అయ్యాక ఓ పర్యాయం వచ్చారు. ప్రస్తుతం ఆయన బంధువుల్లో ఎక్కువమంది ముంబయిలో స్థిరపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News