Pawan Kalyan: ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి: రాజధానిపై నివేదిక అందాక పవన్ కల్యాణ్ స్పందన

  • మూడు రాజధానుల అంశంపై జరుగుతోన్న చర్చ అందరికీ తెలుసు
  • అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలి 
  • ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం ఒక అవగాహనకు రావాలి

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రాజధాని విషయంపై రూపొందించిన ఓ నివేదికను పవన్ కల్యాణ్ కు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అందించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై జరుగుతోన్న చర్చ అందరికీ తెలుసని అన్నారు. అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఒకరికి న్యాయం చేసి, మరొకరికి అన్యాయం జరగాలని ఎవరూ కోరుకోకూడదని అన్నారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం ఒక అవగాహనకు రావాలని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
  • Loading...

More Telugu News