varla ramaiah: అమరావతి అంటే ఆటలా? ఒక పద్ధతి అంటూ వుండాలిగా? ఇదేంటి?: వర్ల రామయ్య

  • ముఖ్యమంత్రి గారు జి.ఎన్. రావు కమిటీ వేస్తారు
  • రిపోర్ట్ ఇవ్వక ముందే ప్రకటన చేస్తారు
  • బోస్టన్ కంపనీ రిపోర్ట్ అంటారు 
  • రిపోర్ట్ రాకముందే బొత్స తన అభిప్రాయం చెబుతారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ అమరావతి అంటే ఆటలుగా ఉందా? అంటూ ప్రశ్నించారు.

'ముఖ్యమంత్రి గారు జి.ఎన్. రావు కమిటీ వేస్తారు. రిపోర్ట్ ఇవ్వక ముందే ప్రకటన చేస్తారు. బోస్టన్ కంపనీ రిపోర్ట్ అంటారు మీరు. రిపోర్ట్ రాకముందే బొత్స సత్యనారాయణ తన అభిప్రాయం చెబుతారు. మీ తరువాత మీ అంతటి విజయసాయి రెడ్డి తన అభిప్రాయం చెబుతున్నారు. అమరావతి అంటే ఆటలా? ఒక పద్ధతి అంటూ వుండాలిగా? ఇదేంటి?' అని వర్ల రామయ్య ట్విట్టర్ లో విమర్శలు చేశారు.

varla ramaiah
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News