giriraj singh: వారంటే అంత ఇష్టముంటే ఇటలీకి తీసుకెళ్లు: రాహుల్‌కు కేంద్రమంత్రి సూచన

  • సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు
  • రాహుల్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన గిరిరాజ్ సింగ్
  • అబద్ధాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఫైర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సీఏఏపై కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలోకి అక్రమంగా చొరబడే వారిపై రాహుల్‌కు మరీ అంత ప్రేమ ఉంటే వారిని ఇటలీకి తీసుకెళ్లాలని గిరిరాజ్ సింగ్ సూచించారు.

giriraj singh
Rahul Gandhi
CAA
  • Loading...

More Telugu News