Rekha: సూసైడ్ చేసుకున్నది నా భర్త కాదు: తమిళ టీవీ నటి రేఖ

  • రేఖ భర్త గోపీనాథ్ చనిపోయాడని ప్రచారం
  • వివాహేతర బంధం, అప్పులు, గొడవలు కారణమని వార్తలు
  • తన భర్త బతికే ఉన్నాడన్న రేఖ

మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తన భర్త ఏమీ ఆత్మహత్యకు పాల్పడలేదని తమిళ బుల్లితెర నటి రేఖ స్పష్టం చేసింది. క్రిస్మస్ రోజున పెరంబూరులో గోపీనాథ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోగా, ఆమె టీవీ నటి, వ్యాఖ్యాతగా సుపరిచితురాలైన రేఖ భర్తని, ఇంట్లోని గొడవలు, వివాహేతర సంబంధాలు, అప్పుల బాధతో ఆయన ఈ ఘటనకు పాల్పడి వుండవచ్చని వార్తలు వచ్చాయి.

ఈ ప్రచారంపై తాజాగా స్పందించిన రేఖ, ఆత్మహత్య చేసుకున్నది తన భర్త కాదని స్పష్టం చేసింది. సూసైడ్ చేసుకున్న వ్యక్తి భార్య పేరు జెనీఫర్ రేఖని, ఆమె పేరులో కూడా రేఖ ఉండటం, తన భర్త పేరు గోపీనాథ్ కావడంతోనే ఈ ప్రచారం జరిగిందని తెలిపింది. తన భర్తతో ఎటువంటి గొడవలూ లేవని, ఇద్దరమూ సఖ్యంగా ఉన్నామని, ఈ ప్రచారానికి ఇక స్వస్తి పలకాలని కోరింది.

Rekha
Tv Actress
Tamilnadu
Husbend
Sucide
  • Loading...

More Telugu News