mayawati: ‘పాకిస్థాన్ వెళ్లిపోండి’ అన్న జిల్లా ఎస్పీపై మాయావతి ఫైర్.. న్యాయవిచారణకు డిమాండ్

  • ఆందోళన చేస్తున్న వారిని పాకిస్థాన్ వెళ్లిపోవాలన్న ఎస్పీ
  • తీవ్రంగా స్పందించిన మాయావతి
  • యూపీలోని ముస్లింలందరూ భారతీయులేనని వ్యాఖ్య

‘పాకిస్థాన్ వెళ్లిపోండి’ అంటూ ఆందోళనకారులను ఉద్దేశిస్తూ మీరట్ ఎస్పీ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమన్న ఆమె.. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. యూపీలో నివస్తున్న ముస్లింలు అందరూ భారతీయులేనని, వారేమీ పాక్ జాతీయులు కాదని మాయవతి పేర్కొన్నారు. ఆందోళనల సమయంలో ఓ మతానికి చెందిన వారిని రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. ఎస్పీ వ్యాఖ్యలపై విచారణ జరపాలని, అవసరమైతే అటువంటి వ్యాఖ్యలు చేసిన పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించాలని మాయావతి డిమాండ్ చేశారు.

mayawati
bsp
CAA protest
  • Loading...

More Telugu News